'సైజ్ జీరో' చిత్రం కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క ఇప్పుడు ఎంత ప్రయత్నించినా మరలా తన పూర్వపు ఆకారంలోకి మారడం అంత సులువుగా జరగడం లేదు. ఆమె పడిన కష్టం 'సైజ్ జీరో' తో నెరవేరక పోగా ఇప్పుడు అదే ఆమె పాలిట శాపంగా మారింది. యోగాలో నిష్ణాతురాలు కాబట్టి బరువు పెరిగినా మరలా సన్నబడటం తన చేతిలోనే ఉందని భావించింది స్వీటీ. కానీ ఎంత కష్టపడినా ఆమె పూర్వపు లుక్ మాత్రం రావడం లేదు. ఇప్పటికీ ఆమె బొద్దుగానే కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాహుబలి2'లో దేవసేనగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదటి పార్ట్‌లో ఆమెది చాలా చిన్న పాత్ర. కానీ 'బాహుబలి2'లో మాత్రం ఆమె పాత్ర ఎంతో కీలకం. పాటలు, యుద్దాలు. పోరాటాలు, గ్లామర్ షో.. ఇలా అన్ని రెండోపార్ట్‌లో ఉన్నాయి. దాంతో జక్కన్న అనుష్కను వెంటనే సన్నగా, నాజూకుగా తయారవ్వాలని ఆదేశించాడట. కానీ అనుష్క మాత్రం బరువు తగ్గకపోవడంతో ఆమె పట్ల రాజమౌళి ఎంతో అసంతృప్తిగా ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఆమె ప్రస్తుతం 'బాహుబలి2'తో పాటు సూర్య 'సింగం3, భాగమతి' చిత్రాలలో కూడా చేస్తోంది. వీటిల్లో కూడా ఆమె తన పాత గ్లామర్‌ను పోగొట్టుకుని బొద్దుగా, ఆంటీగానే కనిపించనుందని సమాచారం. ఇదే నిజమైతే ఇక అనుష్క కెరీర్ చరమాంకానికి వచ్చినట్లే అని చెప్పాలి.