గత కొంతకాలంగా నాగచైతన్య, సమంతలు ప్రేమలో మునిగితేలుతున్నారని, వారి వివాహం త్వరలోనే జరగనుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయాలన్నింటిని సమంతనే లీక్ చేసి, పబ్లిసిటీ పొందిందని, చైతూను ముగ్గులోకి లాగిందని కూడా చాలా మంది భావిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు ట్విట్టర్ వేదికగా తన అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మీ పెళ్లి ఎప్పుడు? సెప్టెంబర్‌లోనేనా అని ప్రశ్నించిన అభిమానిని పెళ్లి గురించే కాదు.. హనీమూన్, పిల్లలు వగైరా విషయాలు నీకు ఎవ్వరూ చెప్పలేదా? అని సెటైర్లు వేసింది. ఇక తమ హనీమూన్ పారిస్‌లో ప్లాన్ చేస్తున్నామంటూ సమాధానం ఇచ్చింది. ఇలా ఆమె చైతూ పేరును ఎత్తకుండానే తన పెళ్లి సంగతులు, హనీమూన్, పిల్లలు... తన కెరీర్.. ఇలా ఎన్నింటికో సమాధానం ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది. ఎంతైనా ఈ మాయలేడీకి ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఎలాగో ఎవ్వరు చెప్పనక్కర్లేదని అంటున్నారు.