Advertisement
Google Ads BL

దిల్ రాజు నమ్మకం ఎన్టీఆరా లేక కొరటాలా!


దిల్ రాజు ఏదైనా పని చేస్తున్నాడంటే దానికి ఎంత లాభం వస్తుందనేది ఆలోచించి మరీ డెసిషన్ తీసుకుంటాడు. కానీ ఈ మధ్య దిల్ రాజు తీసుకునే డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ అవుతున్నాయని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. అయితే సినిమాల జయాపజయాలు బేరీజు వెయ్యడం లో దిల్ రాజుకు ఎవరు సాటి రారు. మరి అలాంటి దిల్ రాజు కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'జనతా గ్యారేజ్' సినిమా నైజం ఏరియా  రైట్స్ ని భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడని సమాచారం. ఈ సినిమా రైట్స్ కోసం అనేకమంది పోటీ పడుతున్నా దిల్ రాజు మాత్రం భారీ మొత్తానికి కొనుగోలు చేసాడని అంటున్నారు. అయితే రాజుకి ఈ సినిమాపై ఎంత నమ్మకం లేకపోతే అంత భారీ మొత్తానికి హక్కులు చేజిక్కించున్నాడో అని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అంతే కాకుండా దిల్ రాజు ఈ సినిమా రేట్స్ తీసుకోవడం వల్ల ఇప్పటికే ఆ సినిమాపైవున్న అంచనాలు మరింతగా పెరిగాయంటున్నారు. ఎన్టీఆర్ గత చిత్రం 'నాన్నకు ప్రేమతో' నైజాం రైట్స్ 14 కోట్లకు అమ్ముడుపోయాయి. మరి 'జనతా గ్యారేజ్' నైజాం రైట్స్ ఏకంగా 17 కోట్లకు అమ్ముడు పోయాయట. మరి ఈ సినిమాకు సంబంధించి నైజాం రైట్స్ ని అంత భారీ మొత్తానికి కొనడానికి రాజుకు ఎన్టీఆర్ మీద ఉన్న నమ్మకమా లేక కొరటాల మీద నమ్మకమా అనేది ఆయనకే తెలియాలి. 'జనతా గ్యారేజ్' షూటింగ్ హైద్రాబాద్ లో శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నిత్య మీనన్, సమంత నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs