ఇటీవల కాలంలో పెద్ద హీరోల చిత్రాలు విడుదలకు ముందే లీకైపోతున్నాయి. తాజాగా రజనీకాంత్ నటిస్తున్న'కబాలి' చిత్రం కూడా విడుదలకు ముందే లీకయిన సంగతి తెలిసిందే. కాగా ఇంతకు ముందు అత్తారింటికి దారేది, బాహుబలి, అమితాబ్ నటించిన పా, ఉడ్తాపంజాబ్, గ్రాండ్ మస్తీ, సుల్తాన్.. ఇలా చాలా చిత్రాలు విడుదలకు ముందే లీకయి సంచలనం సృష్టించాయి.. కాగా ఈ చిత్రాల్లో అధికశాతం చిత్రాలు సెన్సార్ కాపీలు విడుదల కావడంతో ఇప్పుడు అందరి అనుమానం సెన్సార్‌బోర్డ్ వైపుకు మళ్లుతున్నాయి. ఏదో ఒకటి రెండు చిత్రాలంటే ఏదో మతలబు జరిగిందని చెప్పుకుంటారు. కానీ ఇటీవల తరచుగా ఇటువంటి భారీ చిత్రాల కొన్ని సీన్స్, పూర్తి చిత్రాలు లీక్ కావడం చూస్తే ఇదో పెద్ద మాఫియాగా మారిన సంగతి అర్ధమవుతోంది. దీంతో పెద్ద చిత్రాల దర్శకనిర్మాతలు, హీరోలు తమ చిత్రాలకు ఎక్కడ ఆ సమస్య వస్తుందో అని తలలుపట్టుకుంటూ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు అందరి అనుమానం సెన్సార్‌బోర్డ్ పైనే!