ప్రస్తుతం పెద్దగా విజయాలు లేని రకుల్‌ప్రీత్‌సింగ్ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతూ స్టార్స్ చిత్రాలలో అవకాశాలను సాధిస్తూ బిజీ బిజీగా ఉంది. కానీ ఆమెతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన రెజీనా, లావణ్య త్రిపాఠి, సురభి, రాశిఖన్నా వంటి హీరోయిన్లు మాత్రం హిట్లు వస్తున్నా కూడా టాప్ హీరోయిన్లు కాలేకపోతున్నారు. వీరికి విజయాల శాతం బాగానే ఉంది. కానీ స్టార్స్ దృష్టిలో పడలేకపోతున్నారు. దీంతో ఈ హీరోయిన్లు తమకువచ్చిన అవకాశాలతోనే తృప్తి చెందుతూ బండి లాగిస్తున్నారు. మరి వీరు రకుల్‌ప్రీత్‌సింగ్ ఎలా స్టార్లను ఆకట్టుకుందో అలాగే తాము కూడా వెళ్లాలని ఉబలాటపడుతున్నారు. మరి వారి ఎదురుచూపులు ఫలిస్తాయో లేదో వేచిచూడాల్సివుంది.