టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. రెండు సార్లు కోటి రూపాయలు చొప్పున ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్ నజరానా అందించారు. తెలంగాణకు పాకిస్థాన్ కోడలు అంబాసిడర్ ఏమిటని చాలా మంది విమర్శించినా, వాటిని కేసీఆర్ పట్టించుకోలేదు.
సానియా పేరుకే తెలంగాణ అంబాసిడర్ నిజానికి చేసిందేమీ లేదు. తెలంగాణ కోసం ప్రచారం చేసిన దాఖలాలు లేవు. కనీసం హరితహారం కార్యక్రమంలో సైతం ఆమె కనిపించలేదు. అయినప్పటికీ కేసీఆర్ ఆమెను కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే బుధవారం సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ ఎగేనెస్ట్ ఆడ్స్' పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో జరిగింది. దీనికి బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ప్రత్యేకంగా ముంబాయి నుండి విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు.సానియాను పొగిడేశారు. కానీ దీనికి తెలంగాణ ప్రభుత్వం నుండి మాత్రం ఎవరికీ ఆహ్వానం లేదు. బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ, పారితోషికం తీసుకుంటూ, తన వ్యక్తిగత కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. కేేవలం పుస్తకం అమ్ముకోవడం కోసమే షారుక్ ను పిలిచిందని, ఇందులో 'సామాజిక వర్గం కోణం' కూడా ఉందని క్రీడాభిమానులు స్పష్టం చేస్తున్నారు.
29 ఏళ్ల వయసుకే సానియా ఆత్మకథ రాసుకోవడం విచిత్రం. తన కెరీర్ ముగిసిందని భావిస్తోందా అనేది ఆమె తెలపాలి.