Advertisement
Google Ads BL

హరితహారంలో దాసరి లేరెందుకూ !!


పిలిచిందే తడవుగా ఆడియో వేడుకలకు, సినిమా ప్రారంభోత్సవాలకు వెళ్లే దర్శకతర్న దాసరి నారాయణరావు హరితహారంలో మాత్రం కనిపించలేదు. టాలీవుడ్ లో దాదాపు అందరూ వీలున్న చోట మెుక్కలు నాటితే దాసరి మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఆరోగ్యం సహకరించకున్నా సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల సైతం హరితహారంలో పాల్గొన్నారు. దాసరికి ఆ మాత్రం ఓపికలేకపోయిందా... రాష్ట్రం పచ్చతోరణంగా మారాలని ప్రభుత్వం సంకల్పిస్తే సెలబ్రీటీలు మద్దతు తెలపాలి. పైగా 'ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేట్' అని దాసరి పలు సందర్భాల్లో కితాబునిచ్చారు.

Advertisement
CJ Advs

దాసరి ఇల్లు విడిచికదలడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయట. ఆయన ఏ పార్టీలో ఉన్నారనేది స్పష్టంగా తేలనప్పటికీ కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. ఈ మధ్య జగన్ తో సైతం దోస్తీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు హరితహారం పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అందువల్ల తను మెుక్కలు నాటితే ఆ పార్టీలు హర్ట్ అవుతాయని అనుకుని ఉండవచ్చు., లేదా కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి తనని ప్రత్యేకంగా ఆహ్వానించి ఉండాల్సిందని భావించి ఉండవచ్చు. దాసరి తనను అందరూ  గౌరవించాలని అనుకుంటారు. ఈ కారణంగానే ప్రజల మద్దతు ఉన్న హరితహారానికి దూరంగా అంటే తన ఇంట్లోనే ఉండిపోయారు.

దాసరికి నగర శివారులో ఫామ్ హౌజ్ ఉంది. కనీసం అక్కడైనా సరే మెుక్కలు నాటి ఉంటే  గౌరవం దక్కేది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs