Advertisement
Google Ads BL

ఉండవల్లి కి వల విసిరాడు..!


రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అంటే రాష్ట్రంలో ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఈనాడు గ్రూప్‌ల అధినేత రామోజీరావును ఓ ఆటాడుకుని వార్తలో నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడదీయంతో ఆగ్రహించిన ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని సమైక్యాంద్ర పార్టీలో చేరాడు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి గుర్తింపు లభించకపోవడంతో కొంతకాలంగా ఆయన రాజకీయమౌనం పాటిస్తున్నారు. మొదట్లో ఆయన వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌ వైపు చూసినప్పటికి అధికారం తమదే అనే అహంకారంతో జగన్‌ ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు. మంచి వ్యూహకర్తగా, కెవిపి తర్వాత వైఎస్‌కు కుడిభుజంగా ఉండి నమ్మకస్తుడిగా పేరున్న ఉండవల్లిని జగన్‌ పట్టించుకోకపోవడం ఆయనకు తీవ్ర మనస్దాపానికి గురిచేసింది. కాగా ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్న జగన్‌.. ప్రస్తుతం ఉండవల్లిని తమ పార్టీలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆయనను తీసుకుంటే కీలకమైన బ్రాహ్మణుల ఓట్లు కూడా తమ పార్టీకి పడతాయని జగన్‌ భావిస్తున్నాడు. ఇటీవలే జగన్‌ రాజమండ్రి వెళ్లి, మాతృవియోగం అయిన ఉండవల్లిని పరామర్శించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో ఉండవల్లి వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీలోకి నమ్మకంతో వచ్చిన పలువురు సీనియర్లు.. జగన్‌ వ్యవహారధోరణి నచ్చక ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు, ఈ పరిస్ధితుల్లో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వైసీపీలో చేరేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని ఆయన సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs