ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ ఎన్ సి సి) సైతం తెలంగాణకు జై కొడుతోందా.. అంటే అవుననే అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసన్నం కోసం క్లబ్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన హరితహారం కార్యక్రమంలో మెుక్కలున్న చోటే కొత్త మెుక్కలు నాటారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే దీనికి ప్రత్యేక అతిథులుగా నమస్తే తెలంగాణ, టీ. న్యూస్ ఛానల్ అథినేతలను పిలిచారు. వారితో మెుక్కలు నాటించారు. గ్రూప్ ఫోటోలు దిగారు. నిజానికి సినీరంగంతో అవినాభావ సంబంధం అనేక మీడియా సంస్థలతో ఉంది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడులతో పాటు మిగతా మీడియా సంస్థలు సినీరంగానికి సేవలు అందిస్తున్నాయి. వీరిలో ఎవరికీ ఆహ్వానం లేదు. కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన మీడియానే పిలిచి క్లబ్ పాలకమండలి తమ అనుకూలత చాటుకుంది.
ఎఫ్. ఎన్. సి.సి.లో సభ్యులుగా అనేక మంది ప్రముఖులున్నారు. క్లబ్ నిర్మాణం కోసం ఆర్థికంగా తోడ్పాటు అందించిన పెద్దలున్నారు. వారెవరినీ పిలవకుండా కేసీఆర్ సంబంధికులనే ఆహ్వానిచండం అంటే వారి పక్షపాత ధోరణి స్పష్టమవుతోంది. అధ్యక్షుడిగా ఉన్న కె.ఎస్.రామారావు, స్థానికి కార్పోరేటర్ కాజా సూర్యనారాయణ, దర్శకుడు శంకర్ దీనికి కారణం అనే మాట వినిపిస్తోంది.