Advertisement
Google Ads BL

'సెల్ఫీ రాజా' లో ఉండాల్సింది ఉంది..!


అల్లరి నరేష్ సినిమా అంటే కామెడీకి  పెద్దపీట ఉంటుంది.. కామెడీ ట్రాక్ తప్పితే అల్లరి నరేష్ ఇక ఏ జోనర్ లో వచ్చినా అతని సినిమాలన్నీబోల్తా కొట్టాయి. అందుకే గ‌త కొంత కాలంగా అతనికి స‌రైన హిట్ లేకుండా పోయింది. మరి ఈసారి ఎలాగైనా కామెడీ తో హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడని తాజాగా విడుదలైన 'సెల్ఫీ రాజా' ట్రైలర్ చెబుతుంది. ఈ ట్రైలర్.. సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. ఈ సినిమాని ఈశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో సుంకర రామబ్రహ్మం సమర్పణ లో గోపి ఆర్ట్స్ పతాకం పై చలసాని రామబ్రహ్మం నిర్మించారు.  అల్లరికి జంటగా సాక్షి చౌదరి, కామ్నారానావత్ లు నటించారు. ఇక ట్రైలర్ గురించి చెప్పుకుంటే ఇందులో కామెడీని దట్టించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి నరేష్ రకరకాల వేషాలు వేసుకుని రౌడీల నుండి తప్పించుకోవడానికి పడే పాట్లు కొత్తగా అనిపించాయి. అంతే కాకుండా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి స్పూఫ్, అలాగే ముందు నుంచి పోలీస్ గెటప్ లో కనిపించి చివరిలో 'చెప్పను బ్రదర్' అంటూ వచ్చే డైలాగ్ తో సెల్ఫీ రాజా ట్రైలర్ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. మరి ఎంతో కాలం గా హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్ కి ఈ 'సెల్ఫీ రాజా' మంచి హిట్ అందిస్తుందేమో..చూద్దాం. 

Advertisement
CJ Advs

Click Here >to see the Selfie Raja New Trailer

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs