Advertisement
Google Ads BL

ఈ స్పీడంతా.. పూర్వవైభవం కోసమే!


కమెడియన్‌ నుండి హీరోగా మారిన తర్వాత సునీల్‌ కొంతకాలం ఓకే అనిపించినప్పటికీ ఆ తర్వాత సునీల్‌ గాడి తప్పింది. ఎప్పుడో చేసిన 'పూలరంగడు' తర్వాత ఆయనకు మరో హిట్టు దక్కలేదు. ప్రస్తుతం సునీల్‌ హీరోగా నటించిన 'జక్కన్న' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సునీల్‌కు కీలకం కానుంది. ఈ చిత్రంతో పాటు సునీల్‌ ఒకే సమయంలో రచయిత, దర్శకుడు అయిన వీరుపోట్ల దర్వకత్వంలో 'ఈడు గోల్డ్‌ ఎహే' చిత్రం కూడా చేస్తున్నాడు. ఈ చిత్రం క్లైమాక్స్‌తో పాటు ఓ పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. మిగిలిన షూటింగ్‌ నిమిత్తం సునీల్‌ ప్రస్తుతం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. 'జక్కన్న' తర్వాత 'ఈడు గోల్డ్‌ ఎహే' చిత్రం కూడా కొద్ది వ్యవధిలోనే విడుదల కానుంది. మరి ఈ రెండు చిత్రాలతో సునీల్‌ మరలా తనను తాను నిరూపించుకుని పూర్వవైభవం సాధించాలని ఆరాటపడుతున్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs