Advertisement
Google Ads BL

మళ్ళీ వారి మధ్య పోటీ తప్పదు..!


సినిమా వాళ్లకి సమ్మర్‌ అనేది అతిపెద్ద సీజన్‌. ఈ సీజన్‌లో తమ చిత్రాలను రిలీజ్‌ చేయాలని సాధారణంగా అందరు హీరోలు, దర్శకనిర్మాతలు భావిస్తుంటారు. ఈ ఏడాది సమ్మర్‌కు పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌', మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం', అల్లుఅర్జున్‌ 'సరైనోడు'తో పాటు కొందరు సాధారణ హీరోల చిత్రాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఈ వేసవిలో వచ్చిన పవన్‌, మహేష్‌ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఒక్క 'సరైనోడు' మాత్రమే బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫలితం సాధించింది. కాగా వచ్చే ఏడాది సమ్మర్‌కు కూడా ఈ ముగ్గురు పోటీ పడటం ఖాయమని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ సీజన్‌ను 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రంతో మొదలెట్టనున్నారు. మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో సినిమా, పవన్‌-డాలీ చిత్రం, బన్నీ-హరీష్‌ శంకర్‌ల చిత్రాలు వచ్చే ఏడాది సమ్మర్‌లో రానున్నాయని తెలుస్తోంది. వాస్తవానికి పవన్‌ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని దర్శకుడు సూర్య ప్రకటించినప్పటికీ ఇప్పుడు సూర్య తప్పుకోవడంతో డాలీతో తెరకెక్కే ఈ నూతన చిత్రం ఆలస్యం కానుంది. దాంతో ఈ చిత్రం కూడా సమ్మర్‌ పోటీలోనే ఉంటుందని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs