Advertisement
Google Ads BL

మేడ మీద అల్లరి నరేష్ ఏం చేస్తున్నాడు?


వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న కామెడీ హీరో అల్లరి నరేష్ చేతి నిండా సినిమాలతో బిజీగానే వున్నాడు. ఆయన ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో నటించిన సెల్ఫీరాజా ఈ నెల విడుదల కానుంది. వీటితో పాటు జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న మా ఇంట్లో దెయ్యం నాకేమీ భయం చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు నరేష్ మరో క్రేజీ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు సీనియర్ నటుడు, రచయిత కృష్ణభగవాన్ కథ, మాటలు అందిస్తున్నారు. బాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అనీష్‌కృష్ణ (అలాఎలా ఫేమ్) దర్శకత్వం వహిస్తారు. కాగా ఈ చిత్రానికి మేడ మీద అబ్బాయి అనే టైటిల్‌ని నిర్ణయించినట్లుగా తెలిసింది. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రం చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs