Advertisement
Google Ads BL

రెవిన్యూ లోటంటూనే జల్సాలు చేస్తున్నారు!


ప్రజల నిత్యావసరాలైన విద్య, వైద్యం, తాగునీరు.. వంటి పలు సంక్షేమ పథకాలకు కేంద్రం ప్రతి రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తుంది. అయితే వాటిని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర జల్సాలకు ఉపయోగిస్తుంటారు. తాజాగా సామాన్యుల నిత్యావసరాలైన వాటి కోసం కేంద్రం ఏపీకి ఏకంగా 700కోట్లు ఇవ్వగా, వాటిని ఆయా రంగాలకు వాడకుండా తన అవసరాలు, జల్సాలు, టూర్ల కోసం చంద్రబాబు ఖర్చు చేశాడంటూ నీతిఆయోగ్‌ బాబుపై అక్షింతలు వేసింది. ఇలా పలు పథకాలకు కేటాయించిన పలు నిధులను దుర్వినియోగం చేయడంపై నీతి ఆయోగ్‌ ఏపీ ముఖ్యమంత్రిపై మండిపడింది. వాస్తవానికి బాబు సీఎం అయినా తర్వాత ఆయన చేస్తున్న దుబారా ఖర్చుపై ప్రజలందరిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజధాని శంకుస్ధాపనల నుండి రాజధాని భూములు, ప్రాజెక్ట్‌లతో పాటు పలు విషయాల్లో టిడిపి నేతలు భారీ అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. కానీ బాబు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో చివరకు ఆయన చేతికే మరకలు అంటడం అందరినీ బాధిస్తోంది. ఒకవైపు రెవిన్యూ లోటు అని చెబుతూనే, చాలా కార్యక్రమాల్లో టిడిపి సర్కార్‌ చేస్తున్న జల్సా ఖర్చులపై మాత్రం విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs