'భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా' సినిమాల హిట్ లతో మంచి ఊపుమీదున్న లావణ్య త్రిపాఠి అడగకపోయినా కొన్ని విషయాలు చెప్పేస్తుంది. ఒక వైపు టాలీవుడ్ లో నటిస్తూనే మరో వైపు కోలీవుడ్ లో అవకాశాలు చేజిక్కించుకుంటుంది. లావణ్య తమిళం లో చేయబోయే థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న సినిమా గురించి కొన్ని విషయాలు బయటపెట్టేసింది. ఇందులో తన రోల్ కు చాలా ప్రయార్టీ ఉంటుందని, తెలుగు, తమిళంలో యాక్టింగ్ ఒకలాగే ఉంటుందని పెద్ద తేడా వుండదని చెప్పుకొచ్చింది. అలాగే తనకు అనుష్క, సమంత, నిత్యామీనన్ నటన అంటే చాలా ఇష్టమని చెప్పింది. అంతే కాకుండా నేనెవరిని లవ్ చెయ్యలేదని, నాకసలు బోయ్ ఫ్రెండ్స్ లేరని చెప్పుకొచ్చింది. అసలు వున్నట్లుండి లావణ్య ఎందుకిలా చెప్పిందో ఎవ్వరికి అర్ధం కావట్లేదు.