ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును విభజించాలని తెలంగాణ ప్రభుత్వం, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఆందోళన చేస్తుంటే దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం మౌనం పాటిస్తున్నాడు. చంద్రబాబు ఈ విషయంలో తన నిర్ణయాన్ని ఎందుకు చెప్పడం లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. బాబు హైకోర్టును విభజిస్తే దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియని సందిగ్ధంలో ఉన్నాడు. అమరావతిలోనే హైకోర్టు పెట్టాలని నిర్ణయిస్తే రాయలసీమలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బాబు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం మరోసారి భగ్గుమనే పరిస్ధితులు ఉన్నాయి. అందుకే బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. దీంతో ఆయన మౌనం పాటిస్తున్నారు. తన సహచర మంత్రులకు కూడా దీనిపై స్పందించవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరి ఈ మౌనం ఎంతకాలమో చూడాలి..? ఎప్పటికైనా నిర్ణయం తీసుకోకతప్పదు. అదేదో ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే సరిపోయే దానికి ఈ విషయాన్ని నాన్చడం బాబుకు ఎలాంటి మేలు చేయదు.