వరుసగా పరాజయాల తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన 'నేను.. శైలజ'తో మరలా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు హీరో రామ్. ఈ ఎనర్జిటిక్ స్టార్ ఇప్పుడు 'నేను..శైలజ' ఇచ్చిన విజయంతో వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఆయన ప్రస్తుతం 'కందిరీగ' ఫేమ్ సంతోష్‌శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన 'పటాస్, సుప్రీం' చిత్రాలతో జోరు మీదున్న అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ వెంటనే ఆయన మరలా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన రెండో చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు గతంలో రామ్‌తో 'ఎందుకంటే ప్రేమంట' వంటి ఫ్లాప్ చిత్రాన్ని తీసిన ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్‌తో ఓ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సంవత్సరమే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. కరుణాకరన్ కంటే ముందు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. మొత్తం మీద క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టుకుని దూకుడు పెంచుతున్నాడు రామ్.