ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వినాయక్ దర్శకత్వంలో తమిళ 'కత్తి' రీమేక్ చేసున్న సంగతి తెలిసిందే. ఇది చిరుకు 150వ చిత్రం. పొలిటికల్ విషయాల్లో యాక్టివ్‌గా లేని చిరంజీవి ఈ చిత్రం తర్వాత కూడా వరుస చిత్రాలను లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు. మాస్ డైరెక్టర్‌గా గతంలో బాలకృష్ణతో 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్‌బస్టర్స్ తీసి ఇటీవల అల్లుఅర్జున్‌తో 'సరైనోడు' తెరకెక్కించి చిరు నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్న బోయపాటి శీను ని.. చిరు పిలిపించి ఓ కథను తన కోసం తయారు చేయాలని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ చిత్రంగా, యాక్షన్ చిత్రంగా ఊరమాస్ చిత్రంగా ఉండనుందని సమాచారం. ఇక 152వ చిత్రంగా మంచి ఫ్యామీలీ చిత్రం చేయాలని భావిస్తున్నాడు. ఇందుకోసం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయాలని చిరు ఆశ పడుతున్నాడు. త్రివిక్రమ్‌ను పిలిపించిన చిరు తన కోసం ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్టోరీని తయారు చేయమని చెప్పినట్లుగా ఫిల్మ్‌నగర్ సమాచారం. మొత్తానికి చిరంజీవి ఇకపై రాజకీయాలకు బై చెప్పి.. సినిమాలపై తన దృష్టిని సారించాడని మాత్రం తెలుస్తుంది.