మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా కొరటాలశివ దర్శత్వంలో రూపొందుతున్న 'జనతాగ్యారేజ్' చిత్రంలో ఆయన కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఇక చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఆయన 'మనమంత' చిత్రంలో ప్రధానమైన పాత్రను చేస్తునాడు. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదైంది. వాస్తవానికి ఈ రెండు చిత్రాలకు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాలని గట్టి పట్టుదలతో ఆయన ఉన్నాడు. కానీ 'జనతాగ్యారేజ్' చిత్రంలోని ఆయన పాత్రకు సాయికుమార్ సోదరుడు రవిశంకర్‌తో డబ్బింగ్ చెప్పాలని భావిస్తున్నారు.కానీ డబ్బింగ్‌ను తానే చేయాలని మోహన్‌లాల్ పట్టుదలతో ఉన్నాడు. దీనిలో భాగంగా ఇప్పుడు 'మనమంతా' చిత్రంలో తన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పాడు... సో..ఈ చిత్రంలో ఆయన తన డైలాగ్ డెలివరితో మెప్పిస్తే 'జనతాగ్యారేజ్'లో కూడా సొంత డబ్బింగ్ చెప్పే అవకాశం ఉంది. దీంతో 'మనమంత' చిత్రం ఇప్పుడు మోహన్‌లాల్ కోరికకు పెద్ద సవాల్‌గా భావిస్తున్నారు.