అమెరికా లో జరిగే 'ఆటా' ఈవెంట్ కి పెద్దఎత్తున సినీతారలు పాల్గొని అక్కడి వారిని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. దానికి ప్రతి ఫలంగా వారు వీరికి పెద్ద ఎత్తున డబ్బు కూడా ముట్టజెబుతారు. కానీ ఈసారి అమెరికా తెలుగు అసోసియేషన్ 'ఆటా'కు తెలుగు సినీతారలు షాక్ ఇచ్చారు. చికాగో లో జరిగే 'ఆటా' ఈవెంటుకి కొన్ని కారణాల వల్ల హాజరుకాలేమని సమంతా, తమన్నా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఇప్పటికే సంపూర్ణేష్ బాబు తనకు జరిగిన అవమానం కారణం గా నేను 'ఆటా' ఈవెంట్ లో పాల్గొనని చెప్పేసాడు. అంతేకాకుండా అనసూయ కూడా సంపూర్ణేష్ కి మద్దతుగా ట్వీట్ చేసింది. అసలు వీరు ఈవెంట్ మేనేజర్ ల వ్యవహార శైలి వల్లే దూరమయ్యారని కొందరు 'ఆటా' ప్రతినిధులు భావిస్తున్నారు. అసలు 'ఆటా' వ్యతిరేఖుల వల్ల ఈ సమస్య ఏర్పడిందా లేక అంతర్గత సమస్యల వల్ల హాజరుకావడం లేదా అనే మీమాంశలో 'ఆటా' యాజమాన్యం ఉంది.