సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా పెక్కు డిమాండ్. ఈయనకు జపాన్, చైనాలలో లెక్కకు మించిన ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇక్కడ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలయిన సినిమాలు చాలా మటుకు సమయం చూసుకొని అక్కడ ఆయా దేశాల్లో వదులుతుంటారు. రజిని కొత్త సినిమా కబాలి విషయానికి వస్తే ఆరు నూరైనా, నూరు నూట పదహారైనా, దుమ్ము రేపే ఓపెనింగ్స్ పోగేసి, బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయం. ఎందుకంటే నిర్మాతలు కూడా కనీవినీ ఎరగని స్థాయిలో కబాలి విడుదల ఉండేలా స్కెచ్ వేస్తున్నారు.
మరీ ముఖ్యంగా సినిమా కథ మొత్తం మలేసియా బ్యాక్ డ్రాపులో ఉండడంతో అక్కడ ఉండే తమిళ జనాభాకు మాత్రమే కాకుండా నేటివ్ ప్రజలకు కూడా కబాలి పట్ల ఓ సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. మరి వ్యాపారం విషయంలో ఏదీ వదులుకోకూడదు కదా. అందుకే కబాలి నిర్మాత కలైపులి ఎస్ తాను ఏకంగా మలేసియాలో 480 స్క్రీన్ల మీద కబాలిని జులై 15న వదలడానికి ప్రయత్నం చేస్తున్నారు. మలేసియా లాంటి చిన్న దేశంలో మహా అయితే 100 థియేటర్లలో ఓ సినిమా పడితే గొప్ప విషయం. అటువంటిది 480 అంటే ఆషామాషీ కాదు. ఏదైతే ఏంటి ఓపెనింగ్ కలెక్షన్స్ మీద కబాలి పెద్ద కన్నే వేసాడు.