వేసవి సందడి ముగిసిపోయిన తరువాత మరోసారి బాక్సాఫీస్ దగ్గర పచ్చ గడ్డి కూడా మొలవట్లేదు. ఇరగదీస్తారనుకున్న హీరోలందరూ మెల్లి మెల్లిగా సద్దుమణుగుతున్నారు. జూన్ నెల చివరకు రావడంతో, అటు రుతుపవనాలు ఇటు తెలుగు సినిమాల పరిస్థితుల్లో వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. అందుకే జులై, ఆగస్టు నెలల్లో వరస పెట్టి పెద్ద చిత్రాలు రిలీజుకు రెడీ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా జులైలో కబాలి, బాబు బంగారం మీదే ఆశలు ఎక్కువగా ఉన్నాయి. అటు తరువాత ఆగస్టులో జనతా గ్యారేజీ ఎలాగూ ఉంది. ఇలా చెప్పుకోదగ్గ బడా చిత్రాలు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చూ.
అందుకే ఇప్పుడు అందరి కన్ను నిఖిల్ చేస్తున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా మీదే పడుతోంది. VI ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అందరినీ అమితంగా ఆకట్టుకుంది. తరువాత ఎటువంటి పబ్లిసిటీ లేకపోవడం, ఆడియో వేడుక, రిలీజ్ డేట్ ఇంకా అఫీషియలుగా బయటికి రాకపోవడంతో పోటీలో కాసింత వెనకపడ్డట్టు కనిపిస్తోంది. హారర్, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ మూవీస్ అన్నింటికీ గిరాకీ బాగా ఉంటున్న ఈ తరుణంలో నిఖిల్ గనక మరోసారి తన స్పెషల్ మార్క్ చూపిస్తే ఈజీగా 20 కోట్ల మార్కు దాటెయ్యొచ్చుఁ. స్వామి రారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య లాంటి భిన్న కథాంశాలతో ముందుకు దూసుకుపోతున్న నిఖిల్ నుండి కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు ఎక్కడికి పోతావు చిన్నవాడా మీద మంచి ఆశలే నెలకొని ఉన్నాయి.