Advertisement
Google Ads BL

మంచి, మర్యాద లేని పొగరుబోతు కుర్ర హీరో!


ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేనిదే ఎటువంటి ఫోర్ గ్రౌండ్ ఉండదన్న విషయం మనకు తెలిసిందే. ఇటీవల అటువంటి బ్యాక్ గ్రౌండ్ ఏదీ లేకుండా ఎదుగుతున్నానని ఫీలవుతున్న ఓ కుర్ర హీరో పురోగమనం వెనకాల అతడిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే దగ్గరి నుండి సెలబ్రిటీ సర్కిల్స్ అందరితోనూ అతగాడికి చనువు పెంచే వరకు ఉత్తమాభిరుచి గల దర్శక నిర్మాత ఒకాయన వెనకాలే ఉన్నాడు. కానీ ఈ రోజు రెండో మూడో హిట్లు పడేసరికి ఈ హీరోగారు పుడింగులా ఫీలయిపోతున్నాడు. ఎంతలా అంటే, తనకు సినీ జన్మనిచ్చిన ఆ దర్శక నిర్మాత కనీస కష్టాలను కూడా ఇతగాడు పట్టించుకోవటం లేదు. ఈ మధ్యే ఒక కొత్త సినిమా మొదలెట్టిన ఈ దర్శక నిర్మాతకు సమయానికి అందాల్సిన డబ్బులు చేతికి రాకపోవడంతో మన వాడే కదాన్న చనువుతో కుర్ర హీరోని ఓ వారం, పది రోజులు మనీ అడ్జెస్ట్ చేయమని అడగడానికి ఇంటికి వెళ్ళాడట. విషయం ముందే పసిగట్టిన పుడింగు హీరో, కనీస మంచి, మర్యాదను సైతం  పాటించకుండా ఇంటి గేటు అవతాలే నిలబెట్టి మాట్లాడి, నీకు అసలు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని పొగరుబోతు తనంతో మొహం మీద కొట్టినట్టుగా చెప్పి గెంటేసినంత పని చేసాడట. 

Advertisement
CJ Advs

స్వాభిమానం గల ఆ దర్శకనిర్మాత సిగ్గుతో అక్కడే చచ్చిపోయినట్లుగా ఫీలవుతుంటే, అతని సహాయంతోనే ఈరోజు మంచి హీరోగా ఎదిగిన ఓ జెంటిల్మెన్ పిలిచి మరీ కావాల్సిన సొమ్మును అరేంజ్ చేసాడట. జరిగిన తతంగాన్ని మొత్తం ఆ దర్శకనిర్మాత మిత్రుడైన ఓ పవర్ ఫుల్, బడా నిర్మాత దగ్గర వెలిబుచ్చగా... వాడి టైం నడుస్తోందని బాగా ఫీలవుతున్నాడు. ఎక్కడో దొరక్కపోతాడా, అప్పుడు వాడి సంగతి చూద్దాం అని చెప్పి ఓదార్చాడట. పరిశ్రమలో మంచి వ్యక్తులు లేరని ఎవరన్నారు చెప్పండి... కొందరయితే పక్కా స్వార్థపరులు అనుకోండి!  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs