రాష్ట్రం విడిపోయి రెండుగా మారినప్పటి నుండి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలంగాణ విషయంలో చూపిస్తున్న ఉత్సాహం ఏపీపై చూపడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏపీని పక్షపాత దోరణిలో చూస్తున్నాడని స్వయంగా టిడిపి నేతలే కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోపం వల్లే చంద్రబాబు గవర్నర్‌కు హ్యాండిచ్చాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ సీఎంలిద్దరినీ ఆయన ఆహ్వానించారు. కానీ ఈ కార్యక్రమానికి కేసీఆర్ వచ్చినా కూడా చంద్రబాబు మాత్రం డుమ్మాకొట్టాడు. దాంతో చంద్రబాబు ఈ ప్రోగ్రాంకు ఎందుకు రాలేదని అక్కడి వారు గుసగుసలాడుకున్నారట. దీంతో పరిస్థితి గమనించిన గవర్నర్ తాను ఇద్దరు సీఎంలను ఆహ్వానించానని, తాను రెండు రాష్ట్రాలు అభివృధ్ది పధంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నానని వివరణ ఇచ్చేంత వరకు ఈ చర్చ సాగింది. అయినా చంద్రబాబు బిజీగా ఉండి ఇఫ్తార్ విందుకు రాలేదా? లేక కావాలనే గవర్నర్‌పై తనకున్న కోపం వల్లే రాలేదా? అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి....!