Advertisement
Google Ads BL

అందుకే పవన్.. డాలీకి అప్పగించాడంట!


ఒకప్పుడు పవన్‌కళ్యాణ్‌ సినిమా అంటే నెలలకు నెలలు షూటింగ్‌ జరిగేది. కానీ 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' ని మాత్రం పవన్‌ వేగంగా పూర్తిచేశాడు. ఈ చిత్రం ప్రేక్షకులను, బయ్యర్లను, అభిమానులను.. ఇలా అందరినీ నిరాశపరచడంతో తన తదుపరి చిత్రాన్ని కూడా పవన్‌ వెంటనే లైన్‌లోకి తీసుకొచ్చాడు. మొదట ఈ చిత్రానికి ఎస్‌.జె.సూర్య దర్శకత్వం అనుకున్నప్పటికీ అతను అర్దాంతరంగా తప్పుకోవడంతో తాను ఆల్‌రెడీ మాట ఇచ్చిన 'గోపాల గోపాల' ఫేమ్‌ డాలీకీ ఈ చిత్ర దర్శకత్వ బాద్యతలను పవన్‌ అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి డాలీని తీసుకునే ముందు పవన్‌ ..డాలీకీ ఒకే ఒక్క కండిషన్‌ పెట్టాడట. ఈ చిత్రం షూటింగ్‌ను ఎలాగైనా మూడునెలలో పూర్తిచేయాలనేది ఆ కండిషన్‌ అని తెలుస్తోంది. దీనికి డాలీ కూడా అంగీకరించంతో ఆయనకే ఈ సినిమా బాధ్యతలను అప్పగించాడు పవన్‌. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీపొడక్షన్‌ వర్క్‌లో డాలీ బిజీబిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలని పవన్‌ ఆలోచనగా చెబుతున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs