ప్రస్తుతం దర్శకదిగ్గజం శంకర్.. రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్‌లు కీలకపాత్రల్లో 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా 'రోబో2.0' చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రహ్మాన్ సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. 200కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మొదట వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్‌కు ఈ చిత్రంలో ఎంతో ప్రాధాన్యం ఉండటం, దాదాపు ఏడు విదేశీ సంస్ధలు ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్‌ను తీర్చిదిద్దనుండటంతో పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ బాగా లేటవుతుందని భావించిన దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి పోస్ట్‌పోన్ చేసినట్లు సమాచారం. మొత్తానికి 'బాహుబలి-ది కనుక్లూజన్' చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదలకు సిద్దమవుతుండగా శంకర్ 'రోబో 2.0' సమ్మర్ నుండి వెనక్కు వెళ్లడం గమనార్హం.