Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌ మరియు ఫ్యాన్స్ కోసమే లేట్!


మొత్తం మీద ఎన్టీఆర్‌ అభిమానుల ఓపికకు థ్యాంక్స్‌ చెబుతూ ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'జనతాగ్యారేజ్‌' టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాడు ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఈ టీజర్‌ రిలీజ్‌ అవుతుందని ఎంతగానో ఎదురుచూసిన ఎన్టీఆర్‌ అభిమానులు ఆరోజున టీజర్‌ను రిలీజ్‌ చేయకపోవడంతో చాలా అసంతృప్తికి లోనయ్యారు. ఇప్పుడు అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. జులై 6వతేదీన ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నారు. కాగా ఈ చిత్రం ఆడియో విడుదలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ట్యూన్స్‌, వాటికి ఎన్టీఆర్‌ వేసే స్టెప్పులు అదిరిపోయే లెవల్లో ఉంటాయని సమాచారం. ఈ చిత్రం ఆడియో విడుదలను మొదట అమెరికాలో అనుకున్నారు. ఆ తర్వాత దానిని హైదరాబాద్‌కు మార్చారు. ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం వేదికగా ఈ ఆడియోను రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 60కోట్లకు పైగా బిజినెస్‌ చేసిన ఈ చిత్రం ఆగష్టు 12వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs