Advertisement
Google Ads BL

రష్మి 'అంతం' పెద్దలకు మాత్రమే!


టివి యాంకర్‌ నుండి సినిమాల్లోకి ప్రవేశించి.. 'గుంటూరుటాకీస్‌' చిత్రంలో హాట్‌ హాట్‌ సీన్లతో, తన గ్లామర్‌ ఆరబోతతో యువతను కట్టివడేసింది రష్మి. ఆమెకు ఆ చిత్రంలో నటనాపరంగా తన టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం రాలేదు. తాజాగా రష్మి ప్రధానపాత్రలో నటించిన 'అంతం' చిత్రం జులై 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ట్రేడ్‌లో మంచి క్రేజ్‌ రావడం, అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీరేటుకు ఈ చిత్రం అమ్ముడుపోవడం విశేషం. రష్మి అందచందాలతో పాటు ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రలో నటించినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా ఈ చిత్రం ఇటీవలే సెన్సార్‌కు వెళ్లింది. ఈ చిత్రంలో శృంగారం, అందాల ఆరబోత, హింస వంటివి కొంత మోతాదు మించిన దృష్ట్యా ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డ్‌ వారు పెద్దలకు మాత్రమే అంటే ఏ సర్టిఫికేట్‌ మంజూరు చేశారు. దీంతో ఈ చిత్రంలో ఆమె అందాల ప్రదర్శన ఏ రేంజ్‌లో ఉండనుందో అని రసిక ప్రియులు.. సినిమా రిలీజ్‌ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs