స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సోనాక్షిసిన్హా ప్రధానపాత్రలో బాలీవుడ్‌లో 'అకీరా' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చాలా లేటయింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్‌కి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆమెకు ఈ చిత్రం పేరుతో పాటు రిలీజ్ డేట్‌తో కూడా మంచి సెంటిమెంట్ ఉంది. ఆ విషయాన్ని తెలుపుతూ ఆమె ట్వీట్ చేసింది. రేణుదేశాయ్ - పవన్‌కళ్యాణ్‌ల కొడుకు పేరు 'అకీరా'. అనుకోకుండా ఈ చిత్రానికి అదే పేరు సెట్ అయింది. ఇక ఈ చిత్రం రిలీజ్ డేట్ సెప్టెంబర్ 2. ఆమె మాజీ భర్త పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 2 వ తేదీ కావడం విశేషం. ఇలా ఈ సినిమాతో పవన్‌కు, రేణుదేశాయ్‌కి మంచి సెంటిమెంట్ ఏర్పడింది.