Advertisement
Google Ads BL

'మొహింజదారో' లో అన్నీ వున్నాయ్..!


అశుతోష్ గోవిర్కర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మొహింజదారో'. 'మొహింజదారో' ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో ప్రేమ, పగ , మోసం,ఫైట్స్ అన్నీ వున్నాయి. అలాగే రొమాంటిక్ సీన్స్ కి కూడా కొదవ లేకుండా ఒక లిప్ లాక్ కిస్ ను కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. హృతిక్ రోషన్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ ని కూడా ట్రైలర్ లో అద్భుతం గా చూపించారు. ఈ  చిత్రాన్ని ఒక డాన్సర్ తో ఒక యువకుడి ప్రేమ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోని మొహింజదారొ సంప్రదాయాల నేపధ్యం లో తెరకెక్కిస్తున్నారు. ముంబై, జబల్ పూర్, థానే, భుజ్ ప్రాంతాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ 60 కోట్లకు అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా విడుదలయ్యాక కూడా 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని చిత్ర నిర్మాతలు గట్టి నమ్మకం తో వున్నారు. హృతిక్ నటించిన చిత్రాలలో ఇంత భారీ మొత్తంలో రికార్డ్ సృష్టించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs