Advertisement
Google Ads BL

SJ సూర్యని తప్పించారా? తప్పుకున్నాడా?


పవన్ కల్యాణ్ కొత్త సినిమాకు దర్శకుడు మారడం సులువుగా జరిగింది. గతంలో కూడా ఇలాంటి మార్పులు జరిగాయి కాబట్టి ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఎస్. జె.సూర్య నటుడిగా బిజీ కావడం వల్లే తప్పుకున్నాడని నిర్మాతలు సర్దుబాటు చేశారు. ఇందులో ఏమేరకు నిజముందనే అనుమానం సినీ వర్గాల్లో కలుగుతోంది. సూర్య తొలుత దర్శకుడు ఆ తర్వాతే నటుడు. దర్శకత్వం అంటే ఆయనకు చాలా మక్కువ. నటన అనేది హాబీ. అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని మెగాఫోన్  పక్కన పెట్టేసి చంచల స్వభావం ఆయనలో లేదని సన్నిహితులు అంటారు పైగా పవన్ కల్యాణ్ వంటి స్టార్ తో సినిమా చేసే అవకాశం అంటే ఏ దర్శకుడైనా ఆనందిస్తాడు. 

Advertisement
CJ Advs

ఎస్.జె.సూర్య చెప్పిన కథ నేరేషన్ పవన్ కి నచ్చలేదని, మార్పులు సూచిస్తే సూర్య అంగీకరించలేదని ప్రచారం జరుగుతోంది. పైగా తొలిత అనుకున్న డేట్స్ తరచుగా మారుతున్నాయి. పవన్ ఎప్పుడు షూటింగ్ చేస్తాడనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న సూర్య సినిమా నుండి పక్కకి తప్పుకోవడానికే మొగ్గు చూపారని అంటున్నారు. విషయం పూర్తిగా తెగకముందే పరస్పర అంగీకారంతో మార్పు జరిగిందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. సూర్య నుండి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకున్నాకే డాలీని ఫైనల్ చేశారని తెలిసింది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs