తనకు హీరోగా కెరీర్‌లో తొలి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ ప్లాప్‌లలో ఉండటంతో, 'భలే భలే మగాడివోయ్', 'కృష్ణగాడి వీరప్రేమగాధ' చిత్రాలతో నేచురల్‌స్టార్‌గా పేరుతెచ్చుకుని క్రేజ్ మీద ఉన్న నాని తన గురువులాంటి ఇంద్రగంటికి మరో అవకాశం ఇస్తున్నాడని తెలియగానే చాలా మంది ఈ చిత్రం ఆడకపోతే ఇంద్రగంటితో పాటు నానికి కూడా రిస్కే అని, నాని మరీ రిస్క్ చేస్తున్నాడని భావించారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రంలోని హీరో క్యారెక్టర్‌ను కేవలం నానిని దృష్టిలో పెట్టుకొనే ఇంద్రగంటి రాశాడని, ఈ పాత్రకు నాని తప్ప మరెవ్వరూ సూట్ కారని విశ్లేషకులు తేల్చేశారు. మరీ పెద్ద హిట్ కాకపోయిన 'జెంటిల్‌మెన్' చిత్రం కూడా బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు తాను టచ్ చేయని జోనర్‌ను ఇంద్రగంటి టచ్ చేశాడు.ఈ చిత్రం కూడా 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' తరహాలో ఆస్దాయి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఒక విధంగా చూసుకుంటే ఇంద్రగంటికి మరలా కొత్త ఊపునిచ్చింది. నానికి కూడా పెద్దగా ప్లస్ కాకపోయినా మైనస్ మాత్రం కాలేదు. ఇక హీరోయిన్‌గా నటించిన నివేదాథామస్, కీలకపాత్ర పోషించిన శ్రీనివాస్ అవసరాలకు ఈ చిత్రం మంచి ప్లస్ అయిందనే చెప్పాలి.