ఇండియాలో 'గాంధీ' చిత్రం ఆడదు. అదే 'కడపకింగ్' అని తీయండి. టూ హండ్రెడ్ డేస్, హండ్రెడ్ డేస్ పక్కాగా ఆడుతుంది... ఈ డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తుందా? మహేష్, పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ మూవీలోని పాపులర్ డైలాగ్ ఇది. నేటి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తున్నారో? ఎలాంటి టైటిల్స్‌ను కోరుకుంటున్నారో తెలియజెబుతూ వ్యంగ్యంగా రాసిన డైలాగ్ ఇది. ఇప్పుడు అదే జరగబోతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా శరత్‌మరార్ నిర్మాతగా ఎస్..జె.సూర్య బదులు డాలీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రానికి 'కడప కింగ్' అనే టైటిల్‌ను అనుకుంటున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రానికి మొదట 'హుషారు' అనే సాఫ్ట్ టైటిల్‌ను, ఆ తర్వాత 'సేనాపతి' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను అనుకొంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈచిత్రం కోసం నిర్మాత శరత్‌మరార్ 'కడప కింగ్' అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా కడప అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు, గొడవలకు గడప వంటిది. ఇక 'కడప కింగ్'అని బతికున్నప్పుడు రాజశేఖర్‌రెడ్డిని, ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్ జగన్‌ను పిలుస్తుంటారు. కానీ జగన్ అంటే పడని పవన్ తన సినిమా టైటిల్ ద్వారా జగన్ పెద్ద తోపేమీ కాదని, అసలైన కడపకింగ్‌ను తానేనని సెటైర్ వేసేలా ఈ టైటిల్ వ్యంగ్యంగా అదే సమయంలో పవర్‌ఫుల్‌గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరీ 'కడప కింగ్' అనే టైటిల్ పెడితే కేవలం ఓ ప్రాంతాన్ని పవన్‌ను పరిమితం చేసేలా ఈ చిత్రం ఉంటుందనే అనుమానాలకు తావిచ్చినట్లు అవుతుందని కొందరి అభిప్రాయం. మరి పవన్ తన చిత్రం టైటిల్‌గా దీనినే ఎంచుకుంటాడా? అనే విషయం అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.