దర్శకరత్నగా పేరు ప్రతిష్టలున్న దాసరి నారాయణరావు ఇప్పుడు కుల ప్రస్తావన తెస్తూ కాపులను అనుకూలంగా మాట్లాడుతున్నారు. తన సినిమాల ద్వారా కులాలను ఏకిపారేసి ఆయన ఒక్కసారిగా కాపు గురించి గొంతుచించుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజల్లో ఉన్న పేరు ప్రతిష్టలు ఒక్కసారిగా పోయాయి.
నిజానికి దాసరికి మొదటినుండి కులపిచ్చి ఉందనే విమర్శలున్నాయి. దీనికి అనేక ఉదాహారణలను చూపిస్తున్నారు. దర్శకుడిగా దాసరి తొలి చిత్రం 'తాత మనవడు'. ఇందులో ఎస్వీ.రంగారావు, కైకాల సత్యనారాయణ, విజయనిర్మల ప్రధాన పాత్రధారులు. ఈ ముగ్గురు కాపు కులానికి చెందినవారే కావడం గమనార్హం. ఇక దాసరి దగ్గర శిష్యులు చేరిన వారంతా కాపులే. రవిరాజా పినిశెట్టి, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, నందం హరిశ్చంద్రరావుతో పాటుగా అనేక మంది దాసరి కులస్తులే. దాసరి తన సినిమాల్లో కైకాల, అల్లు రామలింగయ్యలకు తప్పకుండా పాత్రలు ఇచ్చేవారు. ఎందుకంటే వారు కాపులే కాబట్టి.
దర్శకుడిగా 150 చిత్రాలు చేసి రికార్డ్ నెలకొల్పిన దాసరి తన కులపిచ్చిని మొదటి నుండి చాటుకున్నారు. ఆయన చాలామంది కాపులకు సినిమాలు చేసిపెట్టారు. స్టార్స్‌గా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు కాబట్టి వారితో సినిమాలు చేయకతప్పింది కాదు. అందుకే తరచుగా కమ్మ వర్గానికి చెందిన సినీ స్టూడియోలపై విరుచుకుపడుతుంటారు.
కొసమెరుపు ఏమంటే కాపు కులం కారణంగానే ఆయన కేంద్ర మంత్రి పదవి పోయింది. అప్పట్లో అదే సామాజిక వర్గానికి చెందిన పళ్ళంరాజుకు పదవి ఇవ్వాల్సి రావడంతో దాసరిని తప్పించేశారు.