Advertisement
Google Ads BL

జగపతిబాబు లిస్ట్ లోకి మరో టాప్ మూవీ!


ఏ ముహూర్తాన జగపతిబాబు విలన్‌ పాత్రలు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాడో గానీ ఆయన యమా బిజీగా మారిపోయాడు. తెలుగులోనే కాదు.. తమిళ,మలయాళ బాషల్లో కూడా ఆయన హవా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు విషయానికి వస్తే ఆయన కళ్యాణ్‌రామ్‌-పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఎన్టీఆర్‌-వక్కంతం వంశీల చిత్రంలో విలన్‌గా కీలకమైన పాత్రను చేస్తున్నాడు. తాజాగా ఆయనకు నాగార్జున సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వాస్తవానికి నాగార్జున-జగపతిబాబులు మంచి ఫ్రెండ్స్‌. గతంలో సురేష్‌కృష్ణ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నాగార్జున 'ఆహా' చిత్రాన్ని కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ భక్తిరస చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రియశిష్యుడైన హతీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈచిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రానికి 'ఓం నమోవేంకటేశాయ' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ చిత్రం వచ్చే నెల నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలకపాత్రను పోషిస్తున్నాడని సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs