Advertisement
Google Ads BL

రానా కోసమే పద్దతి మార్చుకున్నాడు!


'లీడర్‌'తో తెరంగేట్రం చేసి తెలుగులోనే కాదు తమిళం, హిందీ భాషల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న నటుడు దగ్గుబాటి రానా. రానా త్వరలో తేజ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. సాధారణంగా మొదట కథను తయారుచేసుకొని తర్వాత ఆ కథకు తగ్గట్లుగా నటీనటులను ఎంచుకోవడం తేజ అలవాటు. కానీ రానా చిత్రం కోసం తేజ తన పద్దతి మార్చుకున్నాడు. ముందుగా రానాను తీసుకొని ఆ తర్వాత ఆయనకు తగ్గ ఓ పవర్‌ఫుల్‌ పాత్రను తయారు చేస్తున్నాడు. ఈ చిత్రంలో రానా సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'బాహుబలి'తో నేషనల్‌, ఇంటర్నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భళ్లాల దేవ 'బాహుబలి2' చిత్రం షూటింగ్‌లో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఆగష్టు చివరి వారం నుండి రానా ప్రీ అవుతాడు. ఈ లోపు తేజ తాను అనుకున్న స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో వున్నాడు. మొత్తానికి సోలో హీరోగా సక్సెస్‌ కావాలని భావిస్తున్న రానాకు, దర్శకుడిగా పూర్వవైభవం కోల్పోయిన దర్శకుడు తేజకు ఈ చిత్రం కీలకం కానుందని చెప్పాలి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs