Advertisement

కాంగ్రెస్‌కు తగిన శాస్తే జరిగింది..!


మొత్తానికి టిడిపి, వైసీపీ ఎమ్మేల్యేలను, నేతలను తెలంగాణలో కేసీఆర్‌ టిఆర్‌ఎస్‌లోకి చేర్చుకొని పార్టీ ఫిరాయింపుల ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేస్తున్న సంగతి తెలిసిందే. టిడిపి నాయకులను, ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లోకీ తీసుకుంటున్న సమయంలో తెలంగాణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను కలిసి కేసీఆర్‌ చేస్తున్న పనిని ఖండించాలని ఆయన కాంగ్రెస్‌ పెద్దలను కోరాడు. మరోపక్క 15మంది టిడిపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి బయటకు ఈడ్చుకొచ్చిన సమయంలో కూడా రేవంత్‌ దీనిని కాంగ్రెస్‌ నాయకులు ఖండించాలని, లేకపోతే ఇప్పుడు తమకు జరగుతున్న పరిస్థితే కాంగ్రెస్‌కు ఎదురవుతుందని చెప్పాడట. అయితే కాంగ్రెస్‌ వారు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్‌ కాంగ్రెస్‌పై దృష్టి పెట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేలను కూడా టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈ విషయమై అన్ని పార్టీలు కలిసి పోరాడాలని, కలిసి గొంతు వినిపించాలని డిమాండ్‌ చేయడం ఏమిటని? రేవంత్‌ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌కు తగిన శాస్తి జరిగిందని ఆయన అంటున్నాడు. ఇక కేసీఆర్‌ కాంగ్రెస్‌పై ఫోకస్‌ పెట్టడం పూర్తయిన తర్వాత మరోరౌండ్‌ బిజెపిపై కన్నేసే ప్రమాదం ఉందని, బిజెపి నాయకులు కూడా టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నప్పుడు నోరు విప్పి ఇది తప్పని చెప్పకపోవడం అన్యాయమని,పరిస్థితి వారి దాకా వస్తే గానీ తీవ్రత అర్ధం కాదని టిడిపి నాయకులు కాంగ్రెస్‌, బిజెపిలను ఎండగడుతున్నారు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement