ఒకవైపు కాపులను చంద్రబాబు ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్న చిరంజీవికి ఇప్పుడు మాలమహానాడు సెగ తగిలింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా చిరు చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. కులాలను ప్రోత్సహించి, వారిని రెచ్చగొడితే చివరకు అవి ఏదో విధంగా తమ మెడకే చుట్టుకుంటాయనే వాస్తవం మరోసారి నిరూపితమైంది. పార్టీని పెట్టి తనను నమ్ముకుని ఓట్లేసిన కాపులను నిలువునా ముంచివేసి కేంద్రమంత్రి పదవికి కోసం నిలువునా కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసిన చిరు తీరును మాలమహానాడు నేతలు కడిగిపారేస్తున్నారు. చిరంజీవి ఇప్పటికైనా ఎస్సీవర్గీకరణ విషయంలో తన మాటను వెనక్కి తీసుకోని పక్షంలో ఆయన్ను రాష్ట్రంలో తిరగనివ్వమని మాలమహానాడు హెచ్చరించింది. రాజకీయం చేతకాక పార్టీని అమ్ముకున్న చిరంజీవి.. ఎస్సీ వర్గీకరణకు సిఫార్సు చేయడం ఆయన చేతగాని తనానికి మచ్చుతునక అని మాలమహానాడు నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికైనా మన రాజకీయనాయకులు కళ్లు తెరిచి కులాలను తమ స్వార్దానికి వినియోగించుకోవడం, ఆయా కులాలను రెచ్చగొట్టడం మానుకోకుంటే రాబోయే రోజుల్లో ప్రతి నాయకుడికీ ఇలాంటి కులాల సెగలు తప్పకపోవచ్చు.