సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రకరకాల పాత్రలను ధరించే ఈ తారలు నిజజీవితంలో ఎలా ఉంటారనేది ఎవరికీ తెలియదు. కాని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలా మంది నటీనటులు చెడు సావాసాలకు బాగా అలవాటు పడిపోతారని బయట టాక్. ఆ మధ్య ఓ హీరోయిన్ పబ్ లో తాగేసి గొడవ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరువక ముందే మరో హీరోయిన్ తన ప్రవర్తనతో కొందరిని ఇబ్బంది పెట్టిందట. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సుమారుగా 15 ఏళ్ళు అవుతోన్న ఈ నటి ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. ఇప్పటికీ అదే గ్లామర్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తోంది. ఇక ఈ అమ్మడుకి సౌత్ లో అవకాశాలు లేనట్లే అనుకుంటున్న సమయంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే రీసెంట్ గా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కోసం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బస చేసిందీ ముద్దు గుమ్మ. ఈ బ్యూటీకి పొగ త్రాగే అలవాటు ఉండడంతో హోటల్ లో ఎవరున్నారనే విషయాలను పట్టించుకోకుండా తను మాత్రం హ్యాపీ గా స్మోక్ చేస్తూ కనిపించింది. పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేయడం తగదని చెప్పిన హోటల్ సిబ్బందిని పట్టించుకోకుండా.. మరోసారి అదే పని చేస్తూ దొరికింది. దీంతో హోటల్ యాజమాన్యం సుమారుగా పాతిక వేల రూపాయల ఫైన్ వేసినట్లు సమాచారం. ఇప్పటికైనా.. తన అలవాట్లు మార్చుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా.. ఉంటుందేమో చూడాలి..!