Advertisement
Google Ads BL

'శ్రీమంతుడు' రికార్డుకు 'అఆ' ఎసరు!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌, సమంత జంటగా రూపొందిన 'అ...ఆ' చిత్రం జూన్‌2న విడుదలై సంచలనాలు నమోదు చేస్తున్నసంగతి తెలిసిందే. మొదటి షో నుండే ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ టాక్‌ రావడంతో ఈ చిత్రం స్టార్‌హీరోల చిత్రాల రేంజ్‌లో విజయాలను నమోదు చేసుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు యూఎస్‌లో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈ చిత్రం అక్కడ కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం అక్కడ రెండు మిలియన్లను సాధించింది. ఇప్పటికి కూడా ఈ చిత్రానికి అక్కడ మంచి వసూళ్లు వస్తూనే ఉన్నాయి.  యూఎస్‌లో 'బాహుబలి', 'శ్రీమంతుడు' చిత్రాల తర్వాతి స్థానాన్ని యూఎస్‌లో 'అ..ఆ' దక్కించుకొంది. యూఎస్‌లో 'శ్రీమంతుడు' చిత్రం 2.8మిలియన్లు వసూలు చేసింది. ఈ వారం కూడా 'అ..ఆ' చిత్రం కనుక డ్రాప్‌ కాకుండా ఇప్పుడున్న రేంజ్‌లోనే దూసుకెళ్తే ఈ చిత్రం యూఎస్‌లో 'శ్రీమంతుడు' రికార్డ్‌ను అదిగమించి, 'బాహుబలి' తర్వాత రెండో స్దానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs