Advertisement
Google Ads BL

రజనీకి ఎక్కడ తగ్గాలో తెలుసు..!!


'రోబో' తర్వాత రజనీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతూ మరో సంచలనానికి తెరతీస్తోన్న చిత్రం 'రోబో2.0'. సాధారణంగా రజనీకాంత్‌ సినిమా అంటే కేవలం ఆయనకున్న ఇమేజ్‌, క్రేజ్‌తోనే ఆ చిత్రాల బిజినెస్‌, కలెక్షన్లు వస్తుంటాయి. అందుకే ఆ సినిమాలకు పనిచేసిన అందరి కంటే రజనీకే ఎక్కువ పారితోషికం ముడుతూ ఉంటుంది. ఇది ఏ స్టార్‌హీరో చిత్రానికైనా సహజం. కానీ 'రోబో2.0' చిత్రం విషయంలో రజనీ పరిస్థితి అలా లేదని సమాచారం. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్‌కుమార్‌ తన వల్ల ఈ చిత్రానికి జరిగే బిజినెస్‌ను బట్టి రెమ్యూనరేషన్‌ ఇవ్వమని పట్టుబట్టాడట. ఆ విధంగా లెక్కేసుకుంటే రజనీకాంత్‌ కంటే అక్షయ్‌కుమార్‌కు వచ్చే మొత్తమే ఎక్కువని తేలిందట. ఇక్కడ అక్షయ్‌కుమార్‌ విషయంలో బాలీవుడ్‌ మార్కెట్‌ కీలకపాత్రను పోషిస్తోంది. బాలీవుడ్‌ బిజినెస్‌ ఎక్కువభాగం అక్షయ్‌కుమార్‌ కారణంగానే జరుగుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందిట. ఈ విషయాన్ని రజనీ కూడా చాలా స్పోర్టివ్‌గా తీసుకొని తన పెద్ద మనసును చాటుకున్నాడని టాక్‌. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs