Advertisement
Google Ads BL

'కబాలి' రెస్పాన్స్ అదిరింది..!


సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న 'కబాలి' తమిళ ఆడియో విడుదలైంది. సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో ఈ పాటలకు సూపర్‌రెస్పాన్స్‌ లభిస్తోంది. టీజర్‌లో చూపించిన 'నెరప్పుడా..' పాటకు అన్నింటికంటే మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ ఆడియోను త్వరలో విడుదల చేస్తామని నిర్మాత కలైపులి థాను తెలిపారు.  రజనీకాంత్‌ సినిమా అంటే అందులో బాలు గాత్రం తప్పనిసరి. ఆయన నటించిన చిత్రాలలోని ఎన్నో పాటలు బాలు కంఠంలో ప్రాణం పోసుకున్నాయి. కానీ ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ ఆడియోలో బాలు ఒక్క పాట కూడా పాడలేదని తెలుస్తోంది. దీంతో బాలు అభిమానులు ఎంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. డబ్బింగ్‌ విషయంలో మనో, పాటల విషయంలో బాలు రజనీ చిత్రాలకు ఇంతకాలం పెట్టనికోటలుగా ఉన్నారు. మరి ఆ ట్రాక్‌రికార్డ్‌కు సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణ్‌ బ్రేక్‌ వేశాడని చెప్పాలి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs