Advertisement
Google Ads BL

నాని అయినా బ్రేక్‌ వేయగలడా....?


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌, సమంతలు నటించిన 'అ..ఆ' చిత్రం ఇంకా బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటుతూనే ఉంది. ఇప్పటికీ ఈ చిత్రం ఫ్యామిలీ, యూత్‌ ప్రేక్షకుల ఆదరణతో హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే ఈచిత్రానికి గత వారం విడుదలైన సుమంత్‌ అశ్విన్‌ 'రైట్‌ రైట్‌', సందీప్‌కిషన్‌ 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రాలు బ్రేక్‌లు వేస్తాయని భావించారు. కాని ఈ చిత్రాలు ఫర్వాలేదనే టాక్‌ తెచ్చుకున్నప్పటికీ 'అ...ఆ' కలెక్షన్లను నిలువరించే సత్తా మాత్రం ఈ చిత్రాలకు లేదని తేలిపోయింది. దాంతో ఇక 'అ...ఆ'కు తిరుగే లేకుండా పోయింది. కనీసం ఫ్యామిలీ ఆడియన్స్‌, యూత్‌లో నితిన్‌కు సమానంగా ఇమేజ్‌ ఉన్న నాని నటిస్తున్న 'జెంటిల్‌మేన్‌' చిత్రం వచ్చే శుక్రవారం విడుదల కానుంది. మరి ఆ చిత్రమైనా 'అ..ఆ' కలెక్షన్లకు గండి కొడుతుందేమో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs