మన స్టార్స్ కానీ, మన హీరోలు గానీ ఖాకీ డ్రస్సు వేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఖాకీ డ్రస్సు వేశారంటే వారి హీరోయిజమే మారిపోతుంది. ఖాకీ డ్రస్సులో అయితే హీరోయిజంతో పాటు నవరసాలు పలికించడానికి వీలవుతుందని మన హీరోల భావన. ఈ విషయాన్ని గతంలో చాలా మంది స్టార్ హీరోలు తమ పోలీస్ పాత్రల ద్వారా మరపురాని హిట్లు అందుకొని నిజం చేశారు. తాజాగా మంచి టాలెంట్ ఉన్న హీరోగా, యంగ్ హీరోల్లో వరుస సక్సెస్‌ల మీద ఉన్న వాడిగా, సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపించాలని తాపత్రయపడే హీరోగా శర్వానంద్‌కు మంచి గుర్తింపు ఉంది. ఆయన ఈమధ్యకాలంలో వరుస హిట్స్ మీద కూడా ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన ప్రస్తుతం భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్,ఎన్.ప్రసాద్ నిర్మాణంలో తన శ్రీవెంకేటేశ్వర సినీచిత్ర బేనర్‌పై ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన చంద్రమోహన్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈచిత్రం శర్వానంద్ కెరీర్‌లో 25వ చిత్రం కావడం గమనార్హం. ఈ మూవీలో శర్వానంద్ తొలిసారిగా పోలీస్ పాత్రను చేస్తున్నాడు. ఈ పాత్ర మంచి వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం.