మెగాకాంపౌండ్‌లో దాదాపు అరడజను మంది హీరోలు ఉన్నారు. వీరి నుండి రాబోయే ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో దాదాపు 15 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మొత్తానికి టాలీవుడ్‌లో మనీ రొటేట్ అవ్వడానికి మెగా క్యాంపు హీరోల పాత్ర ఎంతో ఎక్కువ ఉంది. తమ వరుస చిత్రాలతో వారు ఇండస్ట్రీలోని మనీని రొటేట్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక మెగా హీరోల చిత్రాలతో పాటు ఈ సారి మెగా డాటర్ నిహారిక నటించిన 'ఒక మనసు' చిత్రం కూడా రేసులో ఉంది. వీటిల్లో మెగాక్యాంపు మూల పురుషుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించనున్న ఎస్.జె.సూర్య, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల చిత్రాలు, రామ్‌చరణ్ నటిస్తున్న 'ధృవ', ఆ తర్వాత చేసే సుకుమార్ 'ఫార్ములా ఎక్స్' చిత్రాలు, అల్లుఅర్జున్ నటించనున్న లింగుస్వామి చిత్రం. వరుణ్‌తేజ్ నటిస్తున్న 'మిస్టర్' చిత్రంతో పాటు శేఖర్‌కమ్ముల చిత్రం, సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న 'తిక్క', బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో చేయనున్న 'జవాన్' చిత్రాలు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి నటించే చిత్రం, అల్లుశిరీష్ నటిస్తున్న 'శ్రీరస్తు, శుభమస్తు', మల్లిడి వేణు చిత్రాలు, మెగా డాటర్ నిహారిక నటించిన 'ఒక మనసు'వంటి పలు చిత్రాలు లైన్‌లో ఉండటం విశేషం.