Advertisement
Google Ads BL

నటన నేర్పిన గురువు కీ..పవన్ హెల్ప్!


పవన్‌లో దానగుణం చాలా ఎక్కువ. ఆయన ఈ రేంజ్‌లో టాప్‌స్టార్‌గా ఎదగడం, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనడం వెనుక ఆయన నటన, స్టైల్‌, టాలెంట్‌ వంటివి ఎంతగా ఉపయోగపడ్డాయో.. ఆయన మంచితనం, దయాగుణం, దానగుణం వంటివి కూడా లెక్కలోకి వస్తాయి. అయితే పవన్‌ ఎప్పుడూ.. తాను వారికి ఈ సహాయం చేశానని, ఆ సహాయం చేశానని తన నోటితో చెప్పరు. అలా సహాయం పొందిన వారే ఏదో ఒక సందర్భంలో పవన్‌ తమకు చేసిన సహాయం గురించి చెబుతూ వస్తుంటారు. తాజాగా పవన్‌ తన గురువు సత్యానంద్‌కు చేసిన సహాయం గురించి స్వయంగా ఆయన గురువే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పవన్‌కు నటనలో శిక్షణ ఇచ్చింది సత్యానంద్‌ అనే విషయం తెలిసిందే. అయితే ఒకానొక సమయంలో సత్యానంద్‌ తన చెల్లి పెళ్లి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో పవన్‌ అతని పరిస్దితి తెలుసుకొని ఒకసారి తన ఇంటికి రావాల్సిందిగా అర్జంట్‌గా ఫోన్‌ చేశాడట. పవన్‌ ఇంటికి వెళ్లిన సత్యానంద్‌కు పవన్ ఆ రోజుల్లోనే 50వేలు ఇచ్చాడట. ఆ తర్వాత పెళ్లికి కూడా హాజరై బ్యాగ్‌ నిండా క్యాష్‌ తీసుకొని వచ్చి అవసరం అవుతాయి.. ఉంచమని చెప్పాడట. ఈ విధంగా పవన్‌ సహాయం వల్లనే తన చెల్లి పెళ్లి ఆటంకాలు లేకుండా జరిగిందని స్వయంగా సత్యానంద్‌ వెల్లడించాడు. పవన్‌ తాను సత్యానంద్‌ వద్ద నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు.. తన మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌, అన్న కొడుకు వరుణ్‌తేజ్‌లకు కూడా సత్యానంద్‌ వద్దనే శిక్షణ ఇప్పించాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs