ప్రస్తుతం రామ్‌చరణ్ గీతాఆర్ట్స్ బేనర్‌లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'తని ఒరువన్' రీమేక్ 'ధృవ' చిత్రంలో నటిస్తున్నాడు. పలు పనుల ఒత్తిడి కారణంగా రామ్‌చరణ్ ఈ చిత్రం షూటింగ్‌లో లేటుగా జాయిన్ అయ్యాడు. దీంతో ఆగష్టుకు రావాలనుకున్న ఈ చిత్రం దసరాకి షిఫ్ట్ అయింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ రెండో వారంలో విడుదల చేస్తామని ఈ మద్య యూనిట్ నుండి వార్తలు వచ్చాయి. కానీ దసరా అంటే అక్టోబర్ 11న వస్తుంది. కాబట్టి రెండో వారంలో వస్తే దసరా సెలవులను పెద్దగా క్యాష్ చేసుకోలేమని నిర్మాత అల్లుఅరవింద్ భావిస్తున్నారు. దాంతో ఆయన ఈ చిత్రం రిలీజ్‌ను ప్రీపోన్ చేశారు. సెప్టెంబర్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తద్వారా దసరా సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుందని అల్లుఅరవింద్ భావిస్తున్నాడు. అంతేకాక చరణ్‌కు అక్టోబర్ నెల పెద్దగా కలిసి రావడం లేదు. దాంతో ఈ చిత్రాన్ని సెంటిమెంట్ పరంగా కూడా సెప్టెంబర్ 30 అయితేనే కరెక్ట్ అని యూనిట్ భావిస్తోంది. సో.. సెప్టెంబర్ 30కి విడుదలను దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషాల్లో హడావుడి పడకుండా ముందునుండే జాగ్రత్తగా షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నారు.