ఇప్పటివరకు తన కెరీర్‌లో రామ్‌చరణ్ డాక్టర్ పాత్రను చేయలేదు. త్వరలో చరణ్ ఓ చిత్రంలో పూర్తి స్ధాయి డాక్టర్ పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం రామ్‌చరణ్.. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళ 'తని ఒరువన్'కు రీమేక్‌గా 'ధ్రువ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటివలే మొదలైంది. ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్.. సుకుమార్ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడు. రొటీన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను సాధిస్తూ ఉండటంతో రామ్‌చరణ్ డేర్ చేసి ఓ కొత్త తరహా చిత్రానికి ఓకే చెప్పాడు. వాస్తవానికి సుకుమార్ విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో సుప్రసిద్దుడు. అదే తరహాలో ఆయన రామ్‌చరణ్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఈ చిత్రానికి 'ఫార్ములా ఎక్స్' అనే టైటిల్‌ను అనుకొంటున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ డాక్టర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇక 'శ్రీమంతుడు, జనతాగ్యారేజ్' చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.