Advertisement
Google Ads BL

మామా అల్లుళ్ల ప్లాన్‌ అదిరింది..!


యంగ్‌ హీరో సందీప్‌కిషన్‌.. ఒక్కో చిత్రంతో ఒక్కో మెట్టు ఎదగాలని భావిస్తున్న ఆర్టిస్ట్‌. తన మేనమామ చోటా కె.నాయుడు బ్యాగ్రౌండ్‌తో తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఈ హీరో చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఇతని హీరో కెరీర్‌లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' మాత్రమే పెద్ద హిట్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద పల్టీ కొడుతున్నప్పటికీ ఆయనకు అవకాశాలు మాత్రం వెతుక్కుంటూనే వస్తున్నాయి. ఆయన తాజాగా నిత్యామీనన్‌తో కలిసి నటిస్తున్న 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం ఈనెల 10న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి రచయిత రాజసింహ దర్శకుడు. ఈ చిత్రానికి సందీప్‌కిషన్‌తో పాటు ఆయన మేనమామ, సినిమాటోగ్రాఫర్‌ చోటా కె నాయుడు కూడా ఎలాంటి పారితోషికం తీసుకోలేదట. ఈ చిత్రం హిట్టయి లాభాలు వస్తే అప్పుడు రెమ్యూనరేషన్‌ తీసుకుంటామని చెప్పి ఉచితంగా పనిచేశారట. మొత్తానికి మేనమామ మార్గదర్శకంలో ఈ హీరో మంచి నిర్ణయాలే తీసుకుంటూ హిట్‌ సినిమాలు కాకపోయినా అవకాశాలు మాత్రం సాధిస్తూనే ఉన్నాడని అర్ధమవుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs