డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించి నిర్మాతగా మారి ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు దిల్ రాజు. ఇటీవల డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా వరుస విజయాలను అందుకుంటున్న దిల్ రాజు 'అ ఆ' సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ''త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అ ఆ' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని నైజాంలో మేమే డిస్ట్రిబ్యూట్ చేశాం. రిలీజ్ చేసిన ఐదు రోజుల్లోనే 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇంకా ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుందో ఊహించలేం. నితిన్ కెరీర్ కి ఇదొక టర్నింగ్ పాయింట్ అయింది. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. గతంలో సమ్మర్ ఎండింగ్ అని జూన్ నెలలో ఎక్కువగా సినిమాలను రిలీజ్ చేసే వారు కాదు. కాని 'అ ఆ' సినిమా జున్2 న రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూత్, ఫ్యామిలీ, మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. ఈ మధ్యకాలంలో రిలీజ్ చేసిన సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన డబ్బు ఒక వారంలోనే తిరిగివచ్చిన సినిమా ఇదే. దీనంతటికీ కారణం త్రివిక్రమ్ ప్రతిభే. తెలుగు నేటివిటీను టచ్ చేస్తూ అధ్బుతంగా సినిమా తీశాడు. ఓవర్సీస్ లో 5 రోజుల్లో రెండు మిలియన్స్ కలెక్ట్ చేసింది. రెవెన్యూ పరంగా 60 కోట్లు క్రాస్ చేస్తుందని భావిస్తున్నాను. స్టార్ హీరో సినిమాకు వస్తోన్న రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మధ్య నేను డిస్ట్రిబ్యూట్ చేసిన రాయుడు, అ ఆ సినిమాలు, ప్రొడ్యూస్ చేసిన సుప్రీమ్ సినిమాలతో ఫస్ట్ క్లాస్ ట్రాక్ లోకి వచ్చానని అనుకుంటున్నాను. పెద్ద డైరెక్టర్స్ అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేస్తే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తే ఇమేజ్ అనే ఊబిలో పది సినిమాకు డివైడ్ టాక్ వస్తోంది. అందుకే నేను కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తున్నాను. అయితే ఈరోజు సినిమా మార్కెట్ అనేది పెరిగిపోయింది. అందుకే నాతో వేవ్ లెంగ్థ్ ఉన్న పెద్ద దర్శకులతో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అందులో భాగంగా ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మా బ్యానర్ లో ఓ సినిమా నిర్మించాలనుకుంటున్నాం. అది కూడా ఓ స్టార్ హీరోతో.. ఇదొక సెన్సేషన్ కు దారి తీస్తుందని చెప్పగలను'' అని చెప్పారు.